BREAKING
ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు

నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి

Select Suryaa Now
నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి
  • శిశువుల ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత : జెసి

పార్వతీపురం, సూర్య: చిన్నారి శిశువులు అపార సంపద అని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతర సంరక్షణ అందించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి పిలుపునిచ్చారు. జాతీయ నవజాత శిశువుల వారోత్సవాలు సందర్భంగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాద్ తో కలిసి బుధవారం కలెక్టరేట్ లో  బ్యానర్, పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ, పోషణ వారి భవిష్యత్ ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రధాన ఉద్దేశ్యంగా కార్యక్రమము పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు అందించేలా,అలాగే పాలు పట్టే పద్ధతులపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయించడం, ఇన్ఫెక్షన్స్ సోకకుండా పరిశుభ్రత పాటించడంపైప్రాధాన్యతనివ్వాలన్నారుతక్కువ బరువుతో జన్మించిన శిశువు, నెలలు నిండక ముందే జన్మించిన శిశువులను గుర్తించి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అందించాలన్నారు. శిశువుల్లో ప్రమాద సూచికలు వెంటనే తెలుసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన ఇవ్వాలన్నారు. ప్రతీ నవజాత శిశువుకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడం ద్వారా శిశు మరణాలు నివారించవచ్చని, తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయవచ్చని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో, ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణకు సంబంధించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి అవగాహన కల్పించాలని వైద్య అధికారులు, సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి , డిఐఓ డా వై. విజయ మోహన్ , ఆర్.బి.ఎస్.కె అధికారి డా టి. జగన్ మోహన్ రావు, డిపిఎంఓ డా.ఎం. రవికుమార్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా. హేమ, డా. వెంకటేష్, డా. గుణశ్రీ , లీలారాణి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.