BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు చదవండి నాయకత్వం వహించండి ఎమ్మెల్యే హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా

గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం

Select Suryaa Now
గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం
  • టిడిపి ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు సతీమణికి దక్కిన అరుదైన అవకాశం
  • గ్రామస్తుల ఏకాభిప్రాయంతో సాగిన ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియ
  • గ్రామాభివృద్ధికి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్పు
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..నూతన సర్పంచ్ ఎడ్ల శాంతి

గరుగుబిల్లి, సూర్య: గరుగుబిల్లి మండల కేంద్రo గరుగుబిల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాసరావు సతీమణి ఎడ్ల శాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామ పెద్దలు, ప్రజలు మరియు పార్టీ శ్రేణులు తీసుకున్న ఏకాభిప్రాయ నిర్ణయంతో ఈ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సర్పంచ్ పదవికి ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అధికారులు ఎడ్ల శాంతి ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు.గ్రామంలో ఎలాంటి విభేదాలకు తావులేకుండా, అందరి ఆమోదంతో ఎడ్ల శాంతిని సర్పంచ్‌గా ఎన్నుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎడ్ల శాంతి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు ఎడ్ల శాంతికి, ఎడ్ల శ్రీనివాసరావుకు పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా ఎడ్ల శాంతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.తన భర్త ఎడ్ల శ్రీనివాసరావు సహకారంతో, గ్రామ పెద్దల సలహాలతో గరుగుబిల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు.