సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ - లబ్ధిదారుల మొహంలో ఆనందం
న్యాల్కల్ ; గ్రామ పంచాయతీలో ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి గ్రామానికి 51 కొత్త ఆసరా పింఛన్లు మంజూరై, లబ్ధిదారులకు అందజేశారు.గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి బద్రు స్వామి తదితరులు పాల్గొన్నారు.51 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎంతో సంతోషంతో పింఛన్లు అందుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ గారు మాట్లాడుతూ - మన గ్రామానికి 51 పింఛన్లు రావడం చాలా సంతోషం. ఇంకా అర్హులైన వారు ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా పింఛన్ వచ్చేలా మేము కృషి చేస్తాం. ఏ ఒక్కరూ ఆసరా లేకుండా ఉండకూడదు అని అన్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ ఇన్ని రోజులు ఎదురుచూసిన పింఛన్ ఈ రోజు చేతికి అందింది. ఇక మా ఖర్చులకు మా డబ్బు ఉంటుంది. సర్పంచ్ గారికి, పంచాయతీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఆనందం వ్యక్తం చేశారు.ఈ 51 పింఛన్లు కేవలం డబ్బు కాదు, 51 కుటుంబాలకు భరోసా, 51 మంది పెద్దలకు గౌరవం, 51 మంది జీవితాల్లో వెలుగు అని గ్రామస్తులు అన్నారు.