తుఫాను ముందస్తు జాగ్రత్తలపై రైతులకు అవగాహన
పోలవరం ,మేజర్ న్యూస్: పోలవరం మండలంలో రైతులకు మండల వ్యవసాయ అధికారి కే రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం తుఫాను ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేటి వరకు కోతలు కోసుకోవాలని వాతావరణం మారిన తర్వాత కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. కోతల తర్వాత పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరి పొలాల్లో మురుగు నీరు పోయేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, సాధ్యమైనంతవరకు డయింగ్ ఫ్లోర్ మీద ఉన్న ధాన్యమంతా సమీప రైతు సేవా కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించి ధాన్యం మిల్లులకు పంపే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది ,రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ షరీఫ్ పోలవరం ఏలూరు జిల్లా