BREAKING
ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా బ్యాటరీ స్క్రాప్ నుండి విలువైన ఖనిజాలను వెలికితీయడం భారత్‌కు ఎందుకు సవాలుగా మారుతోంది? మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి. వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం బడ్జెట్ 2027: ఎల్‌టీసీజీ తగ్గింపు, ఎస్‌టీటీ ఉపశమనం.. ఉల్లిభద్ర సర్పంచ్‌గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం లేడీ సూపర్ స్టార్ నయనతారకు భర్త విగ్నేష్ శివన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్: నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ వైస్ ఎంపీపీ పదవిని జనసేన కేటాయించాలి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై రైతులకు అవగాహన నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి జిందాల్ స్టీల్ నుండి ఎన్‌ఎండీసీ వరకు: క్యూ2 ఫలితాల తర్వాత మెటల్స్, మైనింగ్ రంగంలో సిస్టమాటిక్స్ టాప్ స్టాక్ పిక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చెక్ చేయండి! నేడే"మరడాన"పట్టాభిషేకం.. ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ!

నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని పంచగామ కమాన్ సమీపంలో అయ్యప్ప భక్తులు, మాలాధారణ స్వాములు నూతనంగా కొలువుదీర్చిన శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో బుధవారం శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
స్వాముల ఆహ్వానం మేరకు అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే  స్వామివారికి నైవేద్యం సమర్పించి, హారతి అందుకున్నారు. అనంతరం సన్నిధాన నిర్వాహకులు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురురాజా శర్మ ఆలయ నిర్వాహకులు, వినోద్ పాటిల్ ఆత్మ కమిటీ చైర్మన్, రమేష్ చౌహన్, పండరి రెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సత్యం సెట్, అయ్యప్ప స్వాములు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.