లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
గూడూరు, మేజర్ న్యూస్, డిసెంబర్ 9 న హైదరాబాద్ లో జరుగు ఆదివాసీల బారీ బహిరంగ సభ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం గూడూరు తుడుందెబ్బ మండల అధ్యక్షుడు లింగాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కొమురంభీం సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్ మాట్లాడుతూ అక్రమంగా ఎస్టీ హోదా పొంది అసలైన ఎస్టీ కులాలైనా ఆదివాసీ సమాజానికి విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, నిజమైన ఆదివాసీ సమాజానికి న్యాయం జరగాలంటే లంబాడీలను ఎస్టీ హోదా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ఐదవ షెడ్యూల్ పటిష్ట అమలు, పీసా చట్టం, 1/70 చట్టం, అటవీ హక్కుల పరిరక్షణతో పాటు జల్ జంగిల్ జమీన్ హక్కుల సాధన కోసం డిసెంబర్ 9 బుధవారం రోజున హైదరాబాద్ లో జరుగు ఆదివాసీల బారీ బహిరంగ సభ విజయవంతం కోసం గూడూరు మండలంలోని ప్రతి గూడెం నుండి ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ నాయకులు కల్తీ వీరస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగరావు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లి సారయ్య, జిల్లా నాయకులు పుల్సం మునేష్ కుమార్, పడిగా మంగయ్య, ఈక సుమన్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;యాకూబ్ పాషా, గూడూరు మహబూబాద్ జిల్లా