ఎంఎస్ఎఫ్ నూతన మండలం కమిటీ ఎన్నిక
చిట్యాల, మేజర్ న్యూస్, మండల కేంద్రంలో ఎం ఆర్ పీఎస్ మండల అధ్యక్షులు కొల్లూరి అశోక్ ఆధ్వర్యంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్ పీఎస్ జిల్లా నాయకులు మడిపల్లి శ్యాంబాబు, అంబాల చంద్రమౌళి లు మాట్లాడుతూ విద్యార్థుల విద్యా, సామాజిక, రాజకీయ చైతన్యం కోసం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నిరంతరం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు విద్యార్థి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపు నిచ్చారు. అనంతరం ఎం ఎస్ ఎఫ్ మండల నూతన కమిటీ మండల అధ్యక్షులుగా సరిగొమ్ముల సాయి ప్రణయ్, అధికార ప్రతినిధిగా ఆసంపేల్లి వివేక్, ఉపాధ్యక్షులుగా బండారి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆరేపల్లి రాంచరణ్, కార్యదర్శిగా గుర్రపు అర్జున్ రాజ్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కో-ఇన్ చార్జ్ దోర్నాల రాజేందర్, సీనియర్ నాయకులు నోముల శివశంకర్, సిరిపెళ్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: సదానందం, చిట్యాల ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా