BREAKING
ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా బ్యాటరీ స్క్రాప్ నుండి విలువైన ఖనిజాలను వెలికితీయడం భారత్‌కు ఎందుకు సవాలుగా మారుతోంది? మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి. వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం బడ్జెట్ 2027: ఎల్‌టీసీజీ తగ్గింపు, ఎస్‌టీటీ ఉపశమనం.. ఉల్లిభద్ర సర్పంచ్‌గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం లేడీ సూపర్ స్టార్ నయనతారకు భర్త విగ్నేష్ శివన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్: నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ వైస్ ఎంపీపీ పదవిని జనసేన కేటాయించాలి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై రైతులకు అవగాహన నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి జిందాల్ స్టీల్ నుండి ఎన్‌ఎండీసీ వరకు: క్యూ2 ఫలితాల తర్వాత మెటల్స్, మైనింగ్ రంగంలో సిస్టమాటిక్స్ టాప్ స్టాక్ పిక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చెక్ చేయండి! నేడే"మరడాన"పట్టాభిషేకం.. ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ!

మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం

Select Suryaa Now
మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం

సంగారెడ్డి ; ద్విచక్ర వాహనాలకు కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దాలు వచ్చే మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకుని రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనదారులపై సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, సుమారు 200 మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను కలెక్టరేట్ ఎదుట డీఎస్పీ సత్యయ్య గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ సత్యయ్య గౌడ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని అధిక శబ్దాలతో రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చుకుని వాహనాలు నడిపే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, రూరల్ సీఐ నయీముద్దీన్, టౌన్ సీఐ రాము నాయుడు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.