BREAKING
ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు

Select Suryaa Now
వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీ వెటర్నరీ వర్సటీ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం దేశీయ ఆవుల ఆరోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుదలకు నూతన శాస్త్రీయ విధానాలు అనే అంశంపై ఒక రోజు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ వైకుంఠరావు తెలిపారు. డాక్టర్ వైఎస్సాఆర్ పరిపాలనా భవనంలో అంతర్జాతీయ సదస్సుపై బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గుర్తింపు పొందిన 59 దేశీయ పశుజాతులు విలువైన జన్యు సంపదగా నిలుస్తున్నాయని, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలత, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం, వ్యాధి నిరోధక శక్తి దేశీయ ఆవుల ప్రత్యేక లక్షణాలని తెలిపారు. దేశీయ పశుజాతులు కేవలం పశుసంపద మాత్రమే కాకుండా భారతదేశ వ్యవసాయ సంస్కృతికి, జీవవైవిద్యానికి విలువైన స్థానిక జన్యు సంపదకు ప్రతీకలని చెప్పారు. వాటి విశిష్టమైన జన్యు లక్షణాలను, జాతి స్వచ్ఛతను, సహజ అనుకూలతను భావితరాలకు అందించేందుకు వాటి పరిరక్షణ, శాస్త్రీయ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమన్నారు. దేశంలో పలు రాష్ట్రాల నుంచి 150మందికి పైగా శాస్త్ర వేత్తలు, పశువైద్య నిపుణులు, అధికారులు, దేశంలోని పలు వర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు హాజరుకానున్నారని తెలియజేశారు. అమెరికాకు చెందిన జోసియా మీగ్స్ విశిష్ట ప్రొఫెసర్, డా.పులియూర్ ఎస్. మోహన్ కుమార్, పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ డా.పున్నియమూర్తి నటేశన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్.అమరేంద్ర కుమార్ గౌరవ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ప్రొఫెసర్, డా.డి.శ్రీనివాసులు, ప్రొఫెసర్, డా.బి.నాగరాజన్, ప్రొఫెసర్,డా. నితీన్ మార్కండేయ, ప్రొఫెసర్, డా. కె. వీరబ్రహ్మయ్య, డా.జి.రవికిరణ్, ప్రొఫెసర్,డా. జె.రమేష్, ఈ సమావేశంలోశ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.ఆర్.వినూ, పశువైద్య విజ్ఞాన విభాగం డీన్ డా.ఆర్.వి. సురేష్ కుమార్, పాడిపరిశ్రమ విజ్ఞాన విభాగం డీన్ డా.కె.నాగేశ్వరరావు; పరిశోధనా సంచాలకులు డా.సి.హెచ్.శ్రీలత, విస్తరణ సంచాలకులు డా.బి.శోభామణి: పరీక్షల నియంత్రణాధికారి డా కె.ఆదిలక్ష్మమ్మ ఈ సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. డా.ఆనంద్ కుమార్, అసోసియేట్ డీన్ డా.మాలకొండయ్య; ఎస్.వి. గోసంరక్షణశాల డైరెక్టర్ డా.శివకుమార్ ఈ సదస్సుకు సహ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్