BREAKING
ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి

Select Suryaa Now
 ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి...  పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం...  వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి

తిరుపతి రూరల్,
మేజర్ న్యూస్:
మీ ఇంటి ఆడబిడ్డగా, సోదరిగా, కుమార్తెగా పెరుమళ్ళపల్లి గ్రామపంచాయతీ ప్రజలు ఆదరించి ఒక్క అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించాలని వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి  ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ తన భర్త గుణశేఖర్ రెడ్డి గతంలో పంచాయతీ సర్పంచ్ గా పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పేద బడుగు బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. అలాగే తన బావ స్వర్గీయ మాజీ సర్పంచ్ వాసుదేవ రెడ్డి సర్పంచ్ గా, వీఆర్వో గా ప్రజలకు సేవలు అందించారని పేర్కొన్నారు. తన మామ స్వర్గీయ సుబ్రమణ్యం రెడ్డి గ్రామ రెవెన్యూ అధికారిగా గ్రామ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని చెప్పారు. తాను ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసే కుటుంబం నుంచి వైసీపీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని, ప్రజలు ఆలోచించి  ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. తాను సర్పంచ్ గా గెలిస్తే పంచాయతీ పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలను మరమ్మత్తులు చేయడంతో పాటు అండర్ డ్రైనేజ్ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. లక్ష్మీపురం లో ప్రజల అవసరాల మేరకు సిమెంటు రోడ్డును నిర్మిస్తామని, కొప్పర వాండ్లపల్లి, గాంధీపురం లలో అండర్ డ్రైనేజ్ కాలువలను మొదట ప్రాధాన్యతగా తీసుకొని నిర్మిస్తామన్నారు. గ్రామంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు ఇంటి పట్టాలను తాము సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపల ఇప్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి ఓటర్లకు తెలిపారు. పెరుమళ్ళపల్లి పంచాయతీకి  మొదటి నుంచి తమ కుటుంబం రాజకీయంగా ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజాసేవే ఊపిరిగా సేవలందించమని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా గ్రామపంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే ఒక్క అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.

H. Dwaraka, staff repprter 

9705347341