BREAKING
ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సూర్య, నంద్యాల బ్యూరో:
నంద్యాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో రెండో రోజైన గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. రెండో రోజు నామినేషన్ల వివరాల ప్రకారం బనగానపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 55, వార్డు సభ్యుల స్థానాలకు 207 నామినేషన్లు, కొలిమిగుండ్ల మండలంలో సర్పంచ్ స్థానాలకు 72, వార్డు సభ్యుల స్థానాలకు 198, కోవెలకుంట్ల మండలంలో సర్పంచ్ స్థానాలకు 44, వార్డు సభ్యుల స్థానాలకు 167, సంజామల మండలంలో సర్పంచ్ స్థానాలకు 55, వార్డు సభ్యుల స్థానాలకు 157 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా అవుకు మండలంలో  సర్పంచ్ స్థానాలకు 39, వార్డు సభ్యుల స్థానాలకు 189, వెలుగోడు మండలంలో సర్పంచ్ స్థానాలకు 26, వార్డు సభ్యుల స్థానాలకు 123, మహానంది మండలంలో సర్పంచ్ స్థానాలకు 19, వార్డు సభ్యుల స్థానాలకు 173, ఆత్మకూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 71, వార్డు సభ్యుల స్థానాలకు 229 నామినేషన్లు దాఖలయ్యాయి. బండి ఆత్మకూరు మండలంలో సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యుల స్థానాలకు 224, పాణ్యం మండలంలో సర్పంచ్ స్థానాలకు 75, వార్డు సభ్యుల స్థానాలకు 236, గడివేముల మండలంలో సర్పంచ్ స్థానాలకు 52, వార్డు సభ్యుల స్థానాలకు 209 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ విధంగా రెండో రోజు 11 మండలాల పరిధిలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 కలిపి వెరసి మొత్తం 2,703 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన ఈ నెల 20వ తేదీన కూడా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*