అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి
-చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల
ఆమదాలవలస, నవంబర్ 19, మేజర్ న్యూస్
అభివృద్ధి ప్రభుత్వానికి ఆదరించాలని టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో
11,12,13వ వార్డులలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 28 వార్డుల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వార్డుల్లో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వార్డులోని ప్రజలను, స్థానికులను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రజలతో చర్చించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి వార్డ్ అభ్యర్థులు గురుగుబెల్లి రేవతి, కొత్తపల్లి జయలక్ష్మి, కూన రామలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షరాలు కనితి విజయలక్ష్మి భాయ్, గురుగుబెల్లి మురళీకృష్ణ, బీ. వీ రమణమూర్తి, గొల్లపల్లి సింహాద్రి, నాగళ్ళ మురళీకృష్ణ, కారుణ్య ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.