BREAKING
ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ తీపి పదార్థాలు ఇష్టమా.. రోజుకు ఎంత చక్కెర సురక్షితమో తెలుసుకోండి! సోమాలియా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం! పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి

Select Suryaa Now
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి


- ఎంపీటీసీల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు
- ఎంపీపీగా రామక్రిష్ణ, వైస్ ఎంపీపీ యమునారెడ్డి
కోటబొమ్మాళి, నవంబరు 19, మేజర్ న్యూస్:
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన 21 మంది ఎంపీటీసీ సభ్యులచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. జగన్మోహన్రావు, ఎంపీడీవో కిల్లారి నారాయణరావు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ చాంబర్‌లో నిర్వహించిన ఎన్నికలో మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) తర్ర రామక్రిష్ణ, ఉపాధ్యక్షురాలిగా (వైస్ ఎంపీపీ) కల్లి యమునారెడ్డి, మండల విప్‌గా బొడ్డాపు రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయిన రమేష్, జడ్పీటీసీ పూజారి శైలజ, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, పీఏసీఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నేతలు కల్లి నాగయ్యరెడ్డి, కల్లి లక్ష్మణరెడ్డి, బోయిన సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.