BREAKING
ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ తీపి పదార్థాలు ఇష్టమా.. రోజుకు ఎంత చక్కెర సురక్షితమో తెలుసుకోండి! సోమాలియా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం! పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

Select Suryaa Now
పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

 

పాతపట్నం నవంబర్ 19,మేజర్ న్యూస్:

పాతపట్నం మండలం పాలెంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో ఈరోజు Ms. M. రోషిణి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్యవివాహాల నిర్మూలన చట్టం (Elimination of Child Marriage Act), పోక్సో చట్టం (POCSO Act), డ్రగ్స్ రహిత భారతదేశం తదితర అంశాలపై విద్యార్థులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాల్యవివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పోక్సో చట్టం ద్వారా బాలలకు లభించే చట్టపరమైన రక్షణ, బాలలపై జరిగే లైంగిక వేధింపుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తమకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. అదేవిధంగా డ్రగ్స్ రహిత భారతదేశం లక్ష్యంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు, విద్యార్థుల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ గిరిజారాణి, సీఏ వెంకట్రావు, ఎస్సై మధుసూదన్, ఎమ్మార్వో, రిమాండ్ అడ్వకేట్ ఎల్. యుగంధర్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు బాల్యవివాహాల నిర్మూలన, బాలల రక్షణ, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం కల్పించారు.