BREAKING
ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్.

Select Suryaa Now
కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్.


*తెలుగుదేశం అభ్యర్థులకు బహిరంగ మద్దత్తు తెలిపిన వైసీపీ పార్టీ సభ్యులు.
*నాగమణి పేరు ప్రతిపాదించిన మదనాపురం యంపిటిసి సత్యవతి.
*దేశం సభ్యులకు విప్ జారీ చేసిన పార్టీ అధ్యక్షులు మాధవరావు.
కొత్తూరు నవంబర్ 19(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బమ్మిడి యంపిటిసి టోంపల నాగమణి, వైస్ యంపిపి గా కుంటిభద్ర యంపిటిసి ఆగతముడి అరుణ్ కుమార్ ఎన్నికయ్యారు. మండలంలో 20ఎంపిటిసిలకు మొదట 19 మంది హాజరయ్యారు.సీల్డు కవర్లో  యంపిపి గా టోంపల నాగమణి పేరు వచ్చిందని రిటర్నిగ్ అధికారి యం అన్నాదోర ప్రకటించగా ,మదనాపురం యంపిటిసి ఆగతముడి సత్యవతి ప్రతిపాదించారు. హాజరైన 19మంది సభ్యులలో 17మంది నాగమణి కి చేతులెత్తి మద్దత్తు తెలియజేయగా నాగమణి యంపిపి గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఆ తర్వాత Sand యంపిపి గా కుంటిభద్ర యంపిటిసి ఆగతముడి అరుణ్ కుమార్ పేరును   దిమిలి యంపిటిసి దారపు కృష్ణారావు ప్రతిపాదించగా తెలుగుదేశం జనసేన వైసీపీ సభ్యులు 18 మంది చేతులెత్తి మద్దత్తు తెలియజేశారు. అయితే మండలంలో 
లబ్బ ,గొట్టిపల్లి,గురండి లలో ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యారు. లబ్బవైసీపీ యంపిటిసి పెదకోట త్రివేణి, గొట్టిపల్లి యంపిటిసి(వైసీపీ) మోహనరావు చేతులెత్తి దేశం అభ్యర్థికి బహిరంగంగా మద్దత్తు తెలిపారు.అయితే వైసీపీ పార్టీ మాత్రం విప్ జారీ చేయలేదు. గురండి వైసీపీ యంపిటిసి గులివిందల తులసమ్మ ఎవరికీ మద్దత్తు తెలియ జేయకుండా మౌనంగా ఉండిపోయారు.రిటర్నింగ్ అధికారులు  జనసేన ,వైసీపీ ,ఇండిపెండెంట్  సభ్యులకు వేర్వేరు సీట్లు కేటాయించారు.నూతనంగా ఎన్నికైన యంపిపి నాగమణి  
,వైస్ యంపిపి ఆగతముడి అరుణ్ కుమార్ లను రిటర్నింగ్ అధికారులు శాలువలు తో కప్పి సన్మానించారు. ఎన్నిక కాక ముందు యంపిటిసి లతో మూకుమ్మడిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం20మంది యంపిటిసి లను శాలువలను కప్పి రిటర్నింగ్ అధికారులు సన్మానించారు. కొత్తూరు మండల పరిషత్ యంపిపి వైస్ యంపిపి ఎన్నిక ప్రశాంత వాతావరణం లో జరగడం గమనార్హం.