BREAKING
నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని కలిసిన నూతన ఎంపీటీసీ సభ్యులు అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కొత్త దరఖాస్తులు స్వల్పంగా పెరుగుదల.. కార్మిక మార్కెట్‌పై ఫెడ్ నిఘా! జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.28 లక్షలతో అత్యాధునిక వసతులతో కూడిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఐరోపాలో విద్యుత్‌ వ్యయాలు పెరిగితే కృత్రిమ మేధ పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు మళ్లే ప్రమాదం.. సాంకేతిక వర్గాల హెచ్చరిక! తిరుపతి రూరల్ ఎంపీపీగా కత్తి కళ్యాణి సుధాకర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో ఇంట్లో భోజనం.. చిరంజీవిపై నాజర్ ఆసక్తికర వ్యాఖ్యలు! రష్యా నుంచి ఇంధన దిగుమతులను తిరిగి ప్రారంభించేందుకు ఐరోపా ఆసక్తి చూపడం లేదన్న అమెరికా మంత్రి.. ఇంధన దౌత్యంలో కీలక వ్యాఖ్యలు! ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ!

ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

Select Suryaa Now
ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

సూర్య, నంద్యాల బ్యూరో:సున్నిపెంటలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నంద్యాలలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సున్నిపెంట గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు నామినేషన్లు వేసేందుకు వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్ఓ కార్యాలయం చుట్టూ టీడీపీ శ్రేణులు హడావుడి సృష్టిస్తూ,ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
నామినేషన్ వేసేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని,చివరకు అరెస్టు చేసి,నంద్యాలకు తీసుకొచ్చారని తెలిపారు.
పోలీసుల తీరు చూస్తుంటే ఖాకీ దుస్తుల్లో పచ్చ కండువాలు కప్పుకున్నట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీఎస్పీ సైతం తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నామినేషన్లు ప్రశాంతంగా వేసుకోవచ్చని పోలీసులు చెబుతూనే మరోవైపు తనను అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు.

*..మూడు కోట్లతో కొనుగోలు చేస్తే ప్రజాస్వామ్యం ఖూనీ కాదా..??*
సున్నిపెంటలో ఏకగ్రీవం కావాలని ఎమ్మెల్యే కోరుతున్నారని,ఏకగ్రీవం కోసం సహకరించాలని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటని శిల్పా ప్రశ్నించారు.గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిలదీశారు.
మూడు కోట్ల రూపాయలతో అభ్యర్థులను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రజలు తమ భవిష్యత్తును అప్పగించాలా..?? అని ప్రశ్నించారు.
డబ్బుతో రాజకీయాలను శాసించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు.

*..దమ్ముంటే పోటీ చేసి గెలవాలి..రాజకీయ సన్యాసం తీసుకుంటా..!!*
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి శిల్పా చక్రపాణిరెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
పోలీసుల అండతో,అధికార బలంతో కాకుండా ప్రజల మధ్యకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.
ఎమ్మెల్యేకు నిజంగా ప్రజాబలం ఉంటే పోటీ చేసి గెలవాలని,అలా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు.

*..సున్నిపెంటకు పంచాయతీ హోదా తెచ్చింది వైఎస్సార్ ఘనతే..!!*
సున్నిపెంటను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కీలక పాత్ర పోషించారని శిల్పా తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనూ పంచాయతీ హోదా సాధనకు తాము కృషి చేశామని చెప్పారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు సున్నిపెంట అభివృద్ధికి ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

*..డాక్టర్‌ను సైతం భయపెట్టారు..!!*
గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేయడానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌ను సైతం భయభ్రాంతులకు గురిచేశారని శిల్పా ఆరోపించారు. ఇప్పుడు సున్నిపెంటలోనూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కరు కూడా నామినేషన్ వేయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

*పోలీసుల అండతో ఎన్నికలు గెలవలేరు..!*
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా,పారదర్శకంగా జరగాలని,ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసుకునే హక్కు ఉందని శిల్పా స్పష్టం చేశారు.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వ్యవహరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని హెచ్చరించారు.
సున్నిపెంట ప్రజలు అన్నీ గమనిస్తున్నారని,సరైన సమయంలో తమ ఓటుతో సమాధానం చెబుతారని శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నేత శిల్పా భువనేశ్వర రెడ్డి,న్యాయవాది రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*