తిరుపతి రూరల్ ఎంపీపీగా కత్తి కళ్యాణి సుధాకర్
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండల పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. పెరుమాళ్ళపల్లి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన కత్తి .కళ్యాణి సుధాకర్ ను ఎంపీపీగా , వైస్ ఎంపీపీగా బ్రాహ్మణపట్టు ఎంపీటీసీ 2 రావిళ్ళ సురేంద్ర నాయుడు లను ఏకగ్రీవ ప్రతిపాదనలతో ఎన్నికయ్యారు. గురువారం తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి యశ్వంత్ ప్రమాణ స్వీకరం చేయించారు.
ఎంపీపీ ఎన్నిక :
మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా కత్త కళ్యాణి సి మల్లవరం ఎంపీటీసీ చిగురుపాటి మనోహర్ చౌదరి ప్రతిపాదించారు. పద్మావతి పురం ఎంపిటిసి రాజేంద్ర ఎంపీపీ కళ్యాణిగా బలపరిచారు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనం అయింది. అనంతరం వైస్ ఎంపీపీ గా బ్రాహ్మణపట్టు 2 ఎంపీటీసీ రావిళ్ళ సురేంద్ర నాయుడు పేరును మంగళం ఎంపిటిసి కె నాగరాజు ప్రతిపాదించారు. తిరుచానూరు టు ఎంపిటిసి సుభాషిని రావిళ్ల సురేంద్ర నాయుడు వైస్ ఎంపీపీ గా బలపరిచారు. ఆయనను కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్నికల ప్రక్రియ ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
వైసిపి ఎంపీటీసీల గైర్హాజరు ::
ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారానికి గెలుపొందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 9 మంది సమావేశానికి హాజరు కాలేదు. వారు హాజరు కాకపోయినప్పటికీ ఎంపీపీ కళ్యాణి ఎన్నిక కు కావలసిన మెజారిటీ కూటమి పార్టీకి ఉండటంతో ఎంపీపీ వైస్ ఎంపీపీ లో ఎన్నిక లాంఛనంగా ఎంపిక చేశారు. తిరుచానూరు ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలుపొందిన హారతి టిడిపి కండువా వేసుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ లకు అభినందనలు...
ఏకగ్రీవంగా ఎన్నికైన మండల అధ్యక్షురాలు జి కళ్యాణి, వైస్ ఎంపీపీ రావిళ్ళ సురేంద్ర నాయుడు లకు ఎంపీటీసీ సభ్యులు వేరువేరుగా సెలవులతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి.యశ్వంత్, ఎంపీడీవో జయశ్రీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అందజేశారు.
మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం...
తిరుపతి రూరల్ మండలాన్ని కూటమి ప్రభుత్వము ఆధ్వర్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపీపీ జి కళ్యాణి సుధాకర్ తెలిపారు.
తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డికి, తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, వేమూరు మధు, మల్లంగుంట సింగిల్ విండో చైర్మన్ మధు శేఖర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కో ఆప్షన్ ఎన్నిక వాయిదా :
తిరుపతి రూరల్ మండలం కో ఆప్షన్ మెంబెర్ ఎన్నిక అధికారులు వాయిదా వేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని కుంట్ర పాకం పంచాయతీ నాగూర్ కాలనీకి చెందిన పీరమ్మ ను కోఆప్షన్ మెంబర్ గా ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి కోఆప్షన్ మెంబర్ ఎన్నిక వాయిదా వేసి రెండు మండల మిట్ ల అనంతరం అధికారికంగా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
THANKS & REGARDS
DWARAKA.H
PH.NO:9705347341