జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.28 లక్షలతో అత్యాధునిక వసతులతో కూడిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్యo సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ మిషన్ 2.0 నిధులతో కలెక్టరేట్ ఆవరణలో సుమారు రూ.28 లక్షల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో కూడిన ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో రూ.28 లక్షలతో అత్యాధునిక వసతులతో కూడిన పింక్ టాయిలెట్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జిల్లా అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్యo సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కలెక్టరేట్ ఆవరణలో సుమారు రూ.28 లక్షల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో కూడిన పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న టాయిలెట్స్ మహిళలు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల మరుగుదొడ్డిని సులభంగా గుర్తించేందుకు పింక్ కలర్ థీమ్‌ను రూపొందించడం జరిగిందని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా సానిటరీ పాడ్ ఇన్ సేనిటరీ, పాడ్ వెండింగ్ మిషన్ వంటి సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. చిన్నపిల్లలకు పాలిచ్చే తల్లుల సౌకర్యార్థం ప్రత్యేక విశ్రాంతి గదిని ఏర్పాటు చేసి, అందులో సోఫా, ఊయల వంటి సదుపాయాలను కల్పించామన్నారు. గతంలో ఉన్న డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించేలా నూతన పైప్‌లైన్ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన ప్రవేశ మార్గాలు, ఇతర అనుబంధ వసతులను కూడా అభివృద్ధి చేసామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణ, పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చు ఉద్యోగులందరూ ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆవరణంలో ఉద్యోగుల శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక షటిల్ కోర్టును ప్రారంభించారు. ఉద్యోగులు రోజువారీ విధులతో పాటు క్రీడలు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఈ సదుపాయం దోహదపడుతుందన్నారు. ఉద్యోగులందరూ విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*