BREAKING
దుర్గ సముద్రం ఎంపిటిసి గా పార్వతి ప్రమాణ స్వీకారం నోవార్టిస్‌ దీర్ఘకాలిక ఆదాయ వృద్ధి లక్ష్యం తగ్గింపు.. అంతర్జాతీయ ఔషధ రంగంలో కీలక పరిణామం! ఈ నెల 22 వ తేదీ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు- పోటీల కరపత్రాలు ఆవిష్కరించిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ పాల్ సతీష్ కుమార్, అశోక్ కుమార్ యాదవ్, రామ సుబ్బారెడ్డి తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ గా రావిళ్ళ సురేంద్ర నాయుడు దక్షిణాఫ్రికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు యథాతథం.. ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి సారించిన ఆర్బీ! నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని కలిసిన నూతన ఎంపీటీసీ సభ్యులు అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కొత్త దరఖాస్తులు స్వల్పంగా పెరుగుదల.. కార్మిక మార్కెట్‌పై ఫెడ్ నిఘా! జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.28 లక్షలతో అత్యాధునిక వసతులతో కూడిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఐరోపాలో విద్యుత్‌ వ్యయాలు పెరిగితే కృత్రిమ మేధ పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు మళ్లే ప్రమాదం.. సాంకేతిక వర్గాల హెచ్చరిక! తిరుపతి రూరల్ ఎంపీపీగా కత్తి కళ్యాణి సుధాకర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో ఇంట్లో భోజనం.. చిరంజీవిపై నాజర్ ఆసక్తికర వ్యాఖ్యలు! రష్యా నుంచి ఇంధన దిగుమతులను తిరిగి ప్రారంభించేందుకు ఐరోపా ఆసక్తి చూపడం లేదన్న అమెరికా మంత్రి.. ఇంధన దౌత్యంలో కీలక వ్యాఖ్యలు! ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు!

తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ గా రావిళ్ళ సురేంద్ర నాయుడు

Select Suryaa Now
తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ గా రావిళ్ళ సురేంద్ర నాయుడు

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీగా బ్రాహ్మణపట్టు 2 ఎంపీటీసీ రావిళ్ళ సురేంద్రనాయుడును మండలంలోని ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీ గా సురేంద్ర నాయుడును మంగళం ఎంపీటీసీ కే నాగరాజు ప్రపోజ్ చేశారు. తిరుచానూరు టు ఎంపీటీసీ సుభాషిని వైస్ ఎంపీపీ గా రావిళ్ళ సురేంద్ర నాయుడు ను బలపరిచారు. దీంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి యశ్వంత్ తెలిపారు.
రూరల్ ఎంపీపీగా కత్తి కళ్యాణి సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ 
కుల, మత, ప్రాంత, వర్గ భేదాలకు అతీతంగా మండలంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. వైస్ ఎంపీపీ పదవిని అధికారిక హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తానని, నీతి నిజాయితీలతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి భాగస్వామ్యంతో  సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తనను వైస్ ఎంపీపీగా ఎంపిక కావడానికి  సహకరించిన  ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి పులివర్తి సుధా రెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, మల్లంగుంట సింగిల్ విండో అధ్యక్షులు మధుశేఖర్, టిడిపి మధు కూటమి పార్టీల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

H. Dwaraka, staff reporter

9705347341