ఈ నెల 22 వ తేదీ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు- పోటీల కరపత్రాలు ఆవిష్కరించిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ పాల్ సతీష్ కుమార్, అశోక్ కుమార్ యాదవ్, రామ సుబ్బారెడ్డి
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్.ఆర్.జి.చెస్ అకాడమీ నిర్వహణలో ఈనెల 22వ తేదీన నంద్యాల దేవ నగర్ లో ఉన్న రాహుల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు జిల్లా స్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోటీల వివరాల కరపత్రాలను స్థానిక కళారాధన కార్యాలయంలో జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి,విశ్రాంత జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్,విశ్రాంత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు 12 వివిధ వయసు విభాగాల్లో వేరువేరుగా జరుగుతాయని తెలిపారు. టోర్నమెంట్ కోఆర్డినేటర్ గా రాహుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ డి. వి. సుబ్బయ్య వ్యవహరిస్తారని అన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కొక్క క్యాటగిరి లో 10 ప్రైజ్ ల చొప్పున మొత్తం 120 ప్రైజ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 21 వ తేదీ సాయంత్రం లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9010451585 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*