దుర్గ సముద్రం ఎంపిటిసి గా పార్వతి ప్రమాణ స్వీకారం
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్:
దుర్గ సముద్రం ఎంపీటీసీగా ఎం పార్వతి గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్వతి ఎంపీటీసీగా రిటర్నింగ్ అధికారి యశ్వంత్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు, కుటుంబ సభ్యులు ఆమెను కలసి శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వము ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలం లో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తాను భాగస్వామిగా పాల్గొంటానని చెప్పారు. దుర్గ సముద్రం పంచాయతీ పరిధిలో మండల ప్రజా పరిషత్ నిధులతో రోడ్లు వేయించడం, తాగునీటి బోర్లు ప్రజల అవసరాలకు కావలసిన చోట వేయించడం చేపడుతానని చెప్పారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి పులివర్తి సుధా రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఊరుమిండి మునిశేఖర్, పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో దుర్గ సముద్రం పంచాయతీలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తాను భాగస్వామిని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చేపట్టడంలో ముందు ఉంటానని హామీ ఇచ్చారు.
H. Dwaraka, staff reporter
9705347341.