ఉల్లిభద్ర సర్పంచ్‌గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవం
- గ్రామస్తుల ఏకగ్రీవ మద్దతుతో ఘన విజయం
- ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి సతీమణికి పట్టం
- ఒకే కుటుంబానికి రెండు కీలక పదవులు...
- గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వాసవికుమారి హామీ
- ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి సతీమణికి దక్కిన అరుదైన గౌరవం
గరుగుబిల్లి, సూర్య: గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామి సతీమణి అయిన వాసవికుమారికి గ్రామస్తులం దరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకపక్షమైంది.గ్రామాభివృద్ధే ధ్యేయంగా గ్రామ పెద్దలు, యువత మరియు అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చారు.పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం ద్వారా గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రత్యేక ప్రోత్సాహక నిధులను రాబట్టవచ్చనే ఉద్దేశంతో ఈనిర్ణయం తీసుకున్నారు.ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరడాన వాసవికుమారి, మరడాన నారాయణస్వామి దంపతులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన ఉల్లిభద్ర గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.మరడాన వాసవికుమారి ఎన్నిక పట్ల గ్రామస్తులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.