నేడే"మరడాన"పట్టాభిషేకం.. ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ!
- మండల పరిషత్ పీఠంపై మరడాన నారాయణస్వామి
- ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారాయణస్వామి
- భారీ మెజారిటీ విజయం తర్వాత నేడు పదవీ బాధ్యతల స్వీకారం
- పదవీ బాధ్యతల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన అధికారులు..
గరుగుబిల్లి, సూర్య: మండల రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) మరడాన నారాయణస్వామి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు అధికారులు, పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) మరడాన నారాయణస్వామి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరిం చనున్నారు.ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 1,027 ఓట్ల భారీ మెజారిటీ తో ఘనవిజయం సాధించిన మరడాన నారాయణస్వామికి నేడు ఘనంగా పట్టాభిషేకం జరగనుంది.ఈప్రమాణ స్వీకారోత్సవానికి నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరు కానున్నారు.మండల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని మరడాన నారాయణస్వామి ఈసందర్భంగా పేర్కొన్నారు.ఈవేడుక కోసం మండల పరిషత్ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.నాయకులు, కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నా రు.పార్టీలో, ప్రజల్లో మంచి పట్టున్న మరడాన నారాయణస్వామి ఎంపీపీగా బాధ్యతలు చేపడుతుండటంతో మండల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ,అందరి సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మరడాన నారాయణ స్వామి ఈసందర్భంగా పేర్కొన్నారు.