నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో...
నరసన్నపేట నవంబర్ 15 మేజర్ న్యూస్:రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సుందరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీవో కమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిళ్లా జగన్ మోహనరావు సందర్శించి పరిశీలించారు.
ఈ కేంద్రం పరిధిలోని ఎనిమిది గ్రామపంచాయతీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను ఆయన సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సుందరాపురం, చెన్నాపురం, కొబగాం, చోడవరం, తెలగలవలస, బాడాం, పారసెల్లి, చిక్కలవలస గ్రామపంచాయతీలకు ఈ కేంద్రంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలని, విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.