డిసిసి అధ్యక్షుడిని సన్మానించిన కాంగ్రెస్ నాయకుడు
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆదివారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుమారుడు కే ప్రశాంత్ కుమార్ రెడ్డిని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపల్లి మహేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. వీరారెడ్డి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.