ఖమ్మంలో మున్నూరు కాపు సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొన్న సామినేని ఉదయభాను
ఖమ్మంలో మున్నూరు కాపు సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొన్న సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్ నగర్‌లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు సామాజిక వర్గ పెద్దలు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను నాయకులు, పెద్దలను ఆత్మీయంగా కలుసుకున్నారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా