ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు
గిద్దలూరు, మేజర్‌న్యూస్:
కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితులై గ్రామానికి చెందిన దాదాపు 35 రజక కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.రాజుపాలెం గ్రామంలో అందరికి అండగా నిలిచి సేవ చేసే సుపరిచితుడు , గిద్దలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి గారి సారథ్యంలో, గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో దద్దనాల వెంకట కొండయ్య, లక్ష్మణ్, పెద్ద తిరుమలయ్య, దమ్మా కొండయ్య, శెట్టి, రమణ, చిన్న తిరుమలయ్య, మూడవ కొండయ్య, తిరుమలరావు, నారాయణ , నడిపి కొండయ్య , నుసుం వెంకటరావు, వేములపాటి వెంకట సుబ్బయ్య, తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు నూతనంగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.