జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో నూతనంగా ప్రారంభించిన గ్రంథాలయానికి సర్వశిక్ష అభియాన్ పి ఓ.శ్రీను8వాసులు,జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్ ఆదివారం 8 పుస్తకాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
గ్రంథాలయానికి పుస్తకాలు అందించాలంటూ కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఇచ్చిన పిలుపు, ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు స్వయంగా కలెక్టర్‌కు పుస్తకాలను అందజేశారు. రామాయణ లో ని సుందర కాండ, భగవద్గీత సనాతన ధర్మం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలను వారు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా గ్రంథాలయానికి ఉపయోగకరమైన పుస్తకాలను అందించి పఠనాభిరుచిని ప్రోత్సహించాలని కోరారు.