ఆరోగ్యమే మహాభాగ్యం : KLR
రంగారెడ్డి : మహేశ్వరం మండల కేంద్రంలో రఘుపతి నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్‌ను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR) ప్రారంభించారు.
ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వ్యాయామం, జిమ్ ట్రైనింగ్‌ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరగాలని, ఫిట్‌నెస్ సెంటర్లు యువతకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడంలో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు రఘుపతి, స్థానిక నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాసచారి : మేజర్ న్యూస్ - రంగారెడ్డి