వనభోజనాలకు తరలిన ఆర్యవైశ్య మహిళలు
సూర్య బాన్సువాడ రూరల్ : బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య మహిళలు పలువురు ఆదివారం వనభోజనాలకు తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం మాదిరిగా బాన్సువాడకు కొద్ది దూరంలో ఉన్న బండపల్లి గ్రామ శివారులో గల గణపతి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సామూహికంగా ఒకచోట చేరి వనభోజనాలు చేయడమే కాకుండా కష్టసుఖాలు పంచుకున్నారు. అనంతరం ఆటపాటలతో సరదాగా కాలక్షేపం చేసి సాయంత్రం తిరిగి బాన్సువాడ బాట పట్టారు.