BREAKING
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం! రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం ‎స్త్రీయే వరం..... స్త్రీయే బలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో నూతన పార్కు ప్రారంభం టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు.

బీటెక్ విద్యార్థి బలవన్మరణం

Select Suryaa Now
బీటెక్ విద్యార్థి బలవన్మరణం

 

గాజువాక, మేజర్ న్యూస్ : బ్యాక్‌లాగ్స్ కారణంగా పైతరగతికి ప్రమోట్ కాలేదన్న మనస్తాపంతో ఓ బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. ఏతపాలెంకు చెందిన కొండ్రపు వెంకట్రామ్ చరణ్ (21) కుటుంబంతో కలిసి గాజువాక రాజీవ్‌నగర్‌లో ఉంటున్నాడు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ మూడో ఏడాది చదివిన చరణ్‌కు 14 సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉండిపోవడంతో నాలుగో ఏడాదికి ప్రమోట్ కాలేదు. దీంతో తీవ్ర నిరాశతో ఇంటికి తిరిగివచ్చిన అతడు, శనివారం తల్లి, సోదరి పనిపై బయటకు వెళ్లిన సమయంలో గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్ : కోటిరెడ్డి, గాజువాక, విశాఖపట్నం