పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న
సూర్య కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మార్గదర్శకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు సూచనల మేరకు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు 11వ డివిజన్‌లో పెన్షన్ తుది జాబితాలో పేర్లు వచ్చిన మహిళలను కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ ఆహ్వానించి ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి టిఫిన్ చేస్తూ వారి యోగక్షేమాలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ.. పెన్షన్ ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు. పెన్షన్ తుది జాబితాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గతంలో ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు పెన్షన్ అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకోగానే పెన్షన్ మంజూరైందని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, అర్హులైన వారికి పెన్షన్లు అందించడం ఎంతో మేలు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ మహిళలు, కాంగ్రెస్ పార్టీ 11వ డివిజన్ అధ్యక్షుడు చుక్కల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.