తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి
దేవనకొండ మండల ఫరిదిలోని తెర్నేకల్ గ్రామ సర్పంచిగా వైకాపా సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి భార్య కొత్తకాపు వేదవతి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే తమకు అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు.పార్టీలకతీతంగా తమ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉందని కావున ప్రజల మద్దతు సహకారంతో ఈ నెల 26న జరిగే ఎన్నికలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో వైకాపా నాయకులు సురేంద్ర రెడ్డి,మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్,సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.