BREAKING
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం! రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం ‎స్త్రీయే వరం..... స్త్రీయే బలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో నూతన పార్కు ప్రారంభం టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు.

దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం!

Select Suryaa Now
దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం!

సూర్య జూలపల్లి :మండల కేంద్రంలోని శ్రీ రావుల మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించే దుర్గామాత నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతోపాటు, భక్తుల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించాలనే లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో కమిటీ అధ్యక్షుడిగా బండి స్వామి, ప్రధాన కార్యదర్శిగా లోక రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మామిడిశెట్టి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా అమరగాని పురుషోత్తం, కోశాధికారిగా దీకొండ సాయిప్రసాద్, సలహాదారుగా పొట్టాల మల్లేశం,కార్యవర్గ సభ్యులుగా మల్లెత్తుల కనుకయ్య, బండి రాజయ్య, మల్లెత్తుల నర్సయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బండి స్వామిని కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిభావానికి,సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ, కమిటీ సభ్యుల సమన్వయంతో ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ఉత్సవాల నిర్వహణలో  క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తానన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు, దాతల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను  వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు అమరగాని పర్షయ్య, లక్ష్మీరాజం,