కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత బొమ్మలింగ*
*కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత బొమ్మలింగ*
మండలపరిధిలోని కరిగానపల్లి గ్రామసర్పంచ్ రేసులో మాజీవిద్యార్థి సంఘం నాయకుడు బొమ్మలింగ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా కరిగానపల్లి సర్పంచ్ గా కూటమి తరఫున గొల్ల బొమ్మలింగ సర్పంచ్ టికెట్ ఆశిస్తున్నారు.ఎంఏ బీఈడీ వరకు చదువుకున్న బొమ్మలింగ, విద్యార్థిదశ లో అఖిలభారత విద్యార్థి సంఘం( ఏఐఎస్ఎఫ్) నేతగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకునివెళ్లి పరిష్కరించిన అనుభవం ఉంది. గ్రామంలో ప్రజాసమస్యలపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా, కరిగానపల్లిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు కలిసివస్తుంది.కరిగానపల్లి సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, స్థానిక సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకుపోయే సత్తాగలిగిన వ్యక్తిత్వం కలిగిన బొమ్మలింగకు,గ్రామ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి.కూటమి ప్రభుత్వం అవకాశమిస్తే మంచి మెజార్టీతో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధిష్టానం ఏంనిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం