BREAKING
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం! రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం ‎స్త్రీయే వరం..... స్త్రీయే బలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో నూతన పార్కు ప్రారంభం టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు.

రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం

Select Suryaa Now
రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి  జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం

రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి

జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని, అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకొని జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల సమష్టి కృషి, ప్రజా ఉద్యమంతోనే జిల్లా ఏర్పాటు సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఆదివారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ అతిథి గృహంలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష, ప్రజా సంఘాల సమావేశంలో సమితి నాయకులు తమ్మడబోయిన అర్జున్, తెలంగాణ గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ధీరావత్ రవి నాయక్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి దినేష్, బీజేపీ పట్టణ నాయకుడు చిలుకూరి శ్యామ్, ఎంసీపీఐ నాయకుడు పోతుగంటి కాశీలు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని పేర్కొన్నారు. గతంలో నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో మిర్యాలగూడకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం మరోసారి జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటును కూడా పరిశీలనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులకు వినతిపత్రాలు సమర్పించడం, జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.

మిర్యాలగూడతో పాటు నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలను కూడా జిల్లా సాధన ఉద్యమంలో భాగస్వాములను చేసి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. జిల్లా ఏర్పాటు జరిగితే ప్రజలకు పాలనాపరమైన సౌలభ్యం కలగడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ధనుంజయ నాయుడు, గుండెబోయిన నాగేశ్వరరావు, నాగరాజు, మాలోతు దశరథ నాయక్, దాసరాజు జయరాజు, కృష్ణకాంత్ నాయక్, ఎండీ సోయాబ్, రవికుమార్, కాశీ యాదవ్, పరమేష్, పున్న రాములు, నాయని భాస్కర్, తిరుమలగిరి అశోక్, తిరుమలగిరి అంజి, ఉపేందర్, శ్రీనివాస్, మక్లా నాయక్, చిలక శ్రీనివాస్, అజయ్ కుమార్, బచ్చలకూరి శ్రీనివాస్, కృష్ణ, ఈశ్వరాచారి, మహేష్ గౌడ్, జోసెఫ్, మంద శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.