BREAKING
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం! రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం ‎స్త్రీయే వరం..... స్త్రీయే బలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డులో నూతన పార్కు ప్రారంభం టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు.

‎స్త్రీయే వరం..... స్త్రీయే బలం

Select Suryaa Now
‎స్త్రీయే వరం..... స్త్రీయే బలం

‎

‎

రచన ::- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 

‎సెల్ ::--8247433432

‎అవసరాలు తీర్చే తల్లిగా, ఆదుకొనే చెల్లిగా, అప్యాయతలనందించే భార్యగా, అనురాగాన్ని పంచే నెచ్చెలిగా, ఓపికలో, క్షమాగుణంలో భూదేవిలా కుటుంబంలో బహుముఖ పాత్రలు పోషిస్తున్న విశిష్ట వ్యక్తిత్వం గలది 'స్త్రీ'. 

‎అయితే మనుస్మృతిలో 

‎'పితా రక్షతి కౌమారే,  భర్తా రక్షతి యౌవనే! 

‎రక్షంతి వార్ధకే పుత్రాః  నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి'

‎

‎స్త్రీని బాల్యమునందు తండ్రి, యౌవనమునందు భర్త, వృద్ధాప్యములో కుమారుడు రక్షిస్తారు. కాబట్టి 'స్త్రీ'కి ఏ కాలము నందు స్వాతంత్ర్యము లేదు అంటూ చెప్పబడినట్లుగా అప్పట్లో అడది 'అబల' అయి ఉండవచ్చునేమో... కానీ నేడు 'ఆడది' అబల కాదు 'సబల' అని అనిపించు కోవటమే కాకుండా ఆలోచనల్లో, ఆచరణలో, అభివృద్ధిలో, అధికారాల్లో, ఆస్తి హక్కు ల్లో, అన్నిట్లో తానే ముందు నడుస్తూ 

‎కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తూ చైతన్యవంతమైన పాత్ర పోషిస్తూ అవనిలో సగం, ఆకాశంలో సగం మాదేనంటూ సగర్వంగా చాటుతోన్న నేటి మహిళ పురుష ప్రపంచానికో వరం సమాజానికో బలం.

‎

‎ఈ రోజుల్లో స్త్రీ అన్ని రంగాల్లోనూ ప్రవేశించి తన సత్తా నిరూపించుకుంటోంది... 'ఇంకానా.... ఇంకానా...? ఇకపై సాగవు పురుషాహంకార దౌర్జన్యాలు, కట్టడిచేస్తాం, ముట్టడిస్తాం' అంటూ మెరుపుల్లా విరుచుకు పడుతున్నారు. సమాజంలో అనేకానేక బాధల్లో ఇబ్బందులు పడుతున్న ఆడవారికి అండగా, కొండంత ధైర్యాన్నందిస్తూ 'మహిళా సంఘాలు' ఉద్యమ స్థాయిలో, చైతన్యవంతమైన కృషి చేస్తున్నాయి.

‎

‎క్రీడా, సాహిత్య, కళా రంగాలలో, విద్య, వైజ్ఞానిక, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగాలలో “ఒకటేమిటి అన్నిట్లోనూ స్త్రీలు ప్రవేశిస్తున్నారు. పురుషుల కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కష్టపడుతున్నారు. విజయాలు సాధిస్తున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలలోని మహిళలు సైతం నేడు అనేక విధాలుగా స్వయం శక్తివంతులై రకరకాల అవకాశాలతో దేశ విదేశాల్లో పర్యటనలు చేస్తూ అగ్ర నాయకులతో మాట్లాడటమే కాక వారి నుంచి అభినందనలు, అవార్డులు కూడా అందుకుంటున్నారు అంటే.... వారిలో ఉండే పట్టుదల, ఆత్మ విశ్వాసం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు... 'వెలిగే దీపం తోనే ఇంకో దీపాన్ని 'వెలిగించాలి' అనే సూత్రం మహిళలకు తెలుసు కాబట్టే తాము ఒక్కరే తెలివి అనే వెలుగును సంపాదించుకొని సరిపెట్టుకో కుండా సంపాదించుకొన్న జ్ఞానమనే వెలుగును మరో పది మందికీ 

‎పంచగలుగుతున్నారు. అందరినీ తెలివైనవారుగా 

‎తయారుచేస్తున్నారు.

‎

‎"స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణా

‎సాహసం షడ్గుణం చైవ కామోష్ట గుణ ముచ్యతే'.

‎

‎పురుషుని కంటే స్త్రీకి ఆహరం రెండు పాళ్ళు, బుద్ధి నాలుగు పాళ్లు, ధైర్యం ఆరుపాళ్ళు, కామం (కోరిక) ఎనిమిది పాళ్ళు  ఎక్కువగా ఉంటాయని పెద్దలు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందో కాని బుద్ధి నాలుగు పాళ్ళు, ధైర్యం ఆరుపాళ్ళు, సాదించాలనే కోరిక ఎనిమిది పాళ్ళు ఎక్కువగా ఉండటం మూలంగా పురుషుల నం దాటుకొంటూ, నోళ్ళు 

‎వెళ్ళబెట్టుకొంటూ చూస్తున్న పురుష సమాజాన్ని 

‎ఛేదించుకొంటూ ఎన్నో అభివృద్ధి పనులకు తానే ఆలంబనగా, ఆధారంగా మారుతోంది స్త్రీ. ఆడదాని అధిక్యాన్ని సహించలేని పురుష సమాజం అక్కడక్కడ ఆడవారిని ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉంది. సభ్యసమాజం ఇంకా సిగ్గుపడేలా ఈరోజుల్లో కుడా వరకట్న సమస్యలు పట్టి పీడిస్తున్నాయి ఆడవారిని.

‎

‎అత్త అడపడుచుల వేధింపులు, కొత్త అల్లుళ్ళ తీర్చలేని కోరికలతో ఆడది ఇంకా కొన్ని చోట్ల బాధలు పడుతూనే ఉంది. వీటికి తోడు వెర్రి తలలు వేస్తున్న టీవీ, మీడియా ప్రసారం చేస్తున్న సీరియల్స్ లో ఆడవాళ్ళనే చూపిస్తూ 'ఆడదానికి ఆడదే శత్రువు అనే భావనను కల్పించటం. సభ్య సమాజం తలదించుకునేలా, వివిధ భంగిమల్లో చాలా ఇబ్బందికర వ్యాఖ్యానాలతో, చాలా బహుళ జాతి సంస్థలు, పెట్టుబడుల కంపెనీలు వ్యాపార ప్రకటనల్లో ఆడవారిని విరివిగా వాడుకోవటం, దిగుమతి అవుతున్న విదేశీ దుస్తుల అలంకరణలతో, అనుకరణ నాగరికతలతో చూపించటాలు, వాటిని యువత ఎంతో సరదాగా ఉపయోగించటం ఇలాంటి అనేకానేక విష ప్రభావాల వల్ల ఆడదాని మీద ఆడ దానికి సానుభూతి, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంటే ఇంక మగవారి సంగతి వేరే చెప్పనక్కరలేదనుకుంటా.

‎

‎మనిషి చదువుకోకపోతే పశువు,చదువుకుంటే జ్ఞాని, యోగి అని పెద్దలు చెప్పినట్లుగా చదువుకున్నా. చదువుకోకపోయినా మగవాడు మాత్రం ఆడదాని పట్ల పశువులా, మానవత్వం మరచిన రాక్షసుడిలా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.

‎

‎"ధర్మేచ, అర్దేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి' అంటూ తనతో సహ జీవనం చెయ్యటానికి పసుపు పాదాలతో ఎన్నో ఆశలతో ఏడడుగులు నడిచి అర్ధాంగి అయిన అడదానికి నిండు నూరేళ్ళు భర్తగా రక్షణ కల్పించటం మాని, జీవన సౌఖ్యాన్నందించటం మానేసి, కట్నమనే దాహానికి దాసుడై పోతూ కొన్ని చోట్ల, ఎవరెవరో చెప్పిన మాటలకు అనుమానమనే పెను భూతానికి చిక్కిపోయి కొన్ని చోట్ల, ఇంకా ఇలా అనేకానేక పలు కారణాల వల్ల మరి కొన్ని చోట్ల ఆడదానిని గృహ హింసలకు గురి చేస్తూనే ఉన్నాడు పురుషుడు.

‎

‎రెక్కలు ముక్కలు చేసుకొంటూ ఆఫీసుల్లో, పొలాలలో, ఫ్యాక్టరీలలో... ఎక్కడైనా కానీయండి పని చేస్తున్న ఆడదానికి పురుషుని కన్నా తక్కువ వేతనం 

‎ఇస్తున్నారు... ఇది ఎంత అన్యాయమో?... పగలంతా కష్టపడి ఇంటికి వచ్చిన వెంటనే కుడితిలో పడ్డ ఎలక లాగా, క్షణం తీరిక లేకుండా, గిర్రున ఎగిరే పతంగం లా,

‎ఒక యంత్రంలా అన్ని పనులు తానే చేసుకొంటూ "మగ మహారాజు' అనే భర్తగారికి అన్నీ అమర్చి పెట్టటం... అవి బాగోలేదు... ఇది బాగోలేదు అంటూ సదరు భర్త అనబడే మగ మనిషి కసురుకోవటాలు ఇంకా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి.

‎

‎'ఎందరో వీరుల త్యాగ ఫలం మన నగటి స్వేచ్ఛకే మూల ధనం' అన్నట్లుగా ఎందరో చేసిన కృషి ఫలితంగా కొత్తగా రూపుదిద్దుకొని అమలులోకి వచ్చిన 'గృహ హింస నిరోధక చట్టం' బాధలు పడుతున్న ఆడవారికో వరం, బలం, సామాజిక మహిళా న్యాయం కోసం పోరాడే ఎన్నో మహిళా సంఘాలకు ప్రేరణ, ఊపిరి. ఈ చట్టం ఆధారంగా ఇంకా వెలుగులోకి రాకుండా బాధలలో మగ్గిపోతున్న మహిళల కోసం. నాయకులు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడడాని పట్ల దయ, జాలి, సానుభూతి చూపించనవసరం లేదు.. ఆపదలో ఉన్న ఆడడానికి కాస్తంత ఊరటనిస్తూ చేయూతనివ్వండి... ఇహ చూస్కోండి మహిళ మరో కాళికలా విజృంభిస్తుంది... ప్రళయకాల ఘర్జన చేస్తూ సముద్రునిలా ఉరకలెత్తుతుంది.

‎

‎ఆధునిక కాలంలో వస్తున్న అనేక మార్పుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, సంప్రదాయబద్ధంగా వస్తున్న నాగరికతలను కాపాడుతూ ఉండటం.

‎మన హక్కులు, బాధ్యతలను విస్మరించ కుండా ప్రతి మహిళకు తెలియజెప్పటం, ఇవన్నీ బాధ్యత గల అధికారులు, నాయకులు చెయ్యాల్సిన పనులు. ఆత్మ విశ్వా సాన్ని గోరంత నింపితే కొండంత బలంతో ఉత్సాహంగా పని చేస్తూ ప్రపంచానికి గొప్ప సేవ చేస్తూ ఒక ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది నేటి మహిళ.

‎ఆ దిశగా మహిళలందరూ తమ స్థానాన్ని పొందుతారని.... 

‎జగతికి దైవమిచ్చిన వరం.. బలం..... స్త్రీ 

‎జగతిని ప్రగతిబాట నడిపే శక్తిశాలిని చైతన్య శూలిని

‎జగతికి సృష్టి స్థితి లయకారిణి స్త్రీ 

‎అటువంటి స్త్రీ జాతికంతటికీ

‎శతథా సహస్రథా వందనాలర్పిస్తూ.... 

‎

‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 

‎సెల్ :: --8247433432

‎

‎

‎

‎

‎

‎