BREAKING
లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'!

దివ్యశుభాల దీపావళి.. వెలుగుల పండుగలో ధర్మ సందేశం!

Select Suryaa Now
దివ్యశుభాల దీపావళి.. వెలుగుల పండుగలో ధర్మ సందేశం!

‎
‎
‎దివ్యశుభాల దీపావళి.....
‎
‎రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
‎సెల్ ::-- 8247433432
‎
‎"కాళ్ళ నడుమకు బరికిణీ గదియ వంగి
‎ప్రమిదలో దివ్వె కొడి రాల్చి చమురు వోసి
‎ఘనము కాకుండ సవరించు తెనుగు కన్నె
‎కనులు కార్తిక చంద్రిక కాచు గనులు'
‎అంటూ దీపావళిని అద్భుతంగా వర్ణించారు మహాకవి మధునాపంతుల సత్యనారాయణ మూర్తి గారు
‎
‎చీకటి వెలుగుల్లా దోబూచులాడే కష్టసుఖాలు ప్రతీ మానవుడికి అనుభవం లోనివే. కష్టం వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా సమభావంతో, కలిమి లేములను కావడి కుండల్లా సమంగా భరించినప్పుడే జీవితంలో తృప్తి అనేది కనపడుతుంది. ఈ జీవిత సత్యాన్ని అంతర్భాగంగా మోసుకొచ్చిన వెలుతురు వరుస కాంతుల దీపాల పండగే - దీపావళి.
‎
‎మన పండగలన్నీ జనజీవన స్రవంతి లో అంతర్వాహినులే. జీవన స్థితిగతుల్లోని నిమ్నోన్నతాలను గురించి ప్రత్యేకంగాదివ్య సందేశాన్నిచ్చేది దీపావళి పండగ. దీపావళి అంటే చెడు పై మంచి గెలుపొందటం, ఆ జ్ఞానంపై జ్ఞానం జయించటం, రాక్షసత్వా న్ని తుదముట్టించి మానవత్వానికి పట్టం కట్టటం వంటి అనేక విషయాలు స్పష్టమవుతాయి. ధర్మశాస్త్రాలు, పురాణ కథల ఆధారంగా నరకాసురుడనే రాక్షసుడిపై కృష్ణుడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండగ చేసుకుంటారని అందరికీ తెలుసు.
‎ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులలో ఆనందంగా జరుపు కునే పండగ ఇది. ఐతే అందరూ అనుకునేటట్లుగా ఇది రెండు రోజుల పండగకాదు, మూడు రోజుల పండగ అని పురాణాలు చెబుతున్నాయి. మొదటి రోజు ధన త్రయోదశి అని, రెండవ రోజు నరక చతుర్దశి అని, మూడవ రోజు దీపావళిగా చేసుకోవలసిన ఈ పండగ గురించి కొంత తెలుసుకొందాం
‎
‎మొదటి రోజు ధనత్రయోదశి అనుకున్నాం కదా. ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరి జయంతిగా దీనిని జరుపు కుంటారు. ఈ రోజు ప్రదోషవేళలో దీపం వెలిగించి ముఖద్వారం వద్ద ఉంచటంతో దీపావళి పండగ ప్రారంభమవుతుంది. ఈ రోజున యమునా నదిలో స్నానం చేసి యముడిని, ధన్వంతరిని పూజించాలని, దీపదానం చెయ్యాలని, గృహోపయోగమైన పాత్రలు కొనుక్కోవాలనీ, లోహ పాత్రలు కొనకూడదని, ఈ రోజు వెలిగించిన దీపాన్ని యమదీపం అంటారని, పైన చెప్పినట్లు చెయ్యటం వల్ల సకల విశేషాలతో కూడిన సుఖాలు, జయాలు కలుగుతాయని శాస్త్రా లు చెబుతున్నాయి.

‎ఇక రెండవ రోజు నరక చతుర్దశి అనుకున్నాం కదా, పితృదేవతలను నరకం నుంచి ఉద్ధరించటంకోసం ఈ పండగ చెయ్యాలని చెబుతున్నారు. నరక నివృత్తికి, దాని అధిపతి యమప్రీతికి చేసే పండగ కాబట్టి దీనిని నరక చతుర్దశి అంటారు.
‎ఈ పండగ ఎలా చెయ్యాలో చూడండి.
‎మూడవ జాము తర్వాత సూర్యోదయం కంటె ముందే తలంటి నీళ్ళు పోసుకోవాలి. అనంతరం యమతర్పణ గావించి నాలుగు వత్తుల దీపం వెలిగించి దానిని దానం చెయ్యాలి. మినప ఆకుల కూరతో భోజనం చెయ్యాలి. సాయంకాలం ఇళ్ళల్లోనూ,
‎దేవాలయాల్లోనూ, మండపాల్లోనూ దీపాలు వెలిగించి యముడికి ప్రీతి కలిగించాలి. అలా చేసినవారికి సకల శుభాలు కలుగు తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 'ధర్మ సింధువు' అనే గ్రంథంలో నరక భయ నివారణార్ధం తెల్లవారుజామున నువ్వుల నూనె రాచుకొని తలంటుకోవాలని ఉంది.
‎హేమాద్రి పండితుడు దీనిని 'కౌముదీ మహోత్సవమ'ని, యమునికి తర్పణాలు ఇవ్వాలనీ, ఆ సమయంలో
‎'"యమాయ ధర్మరాజాయ మృత్సవే చాంతకాయ చ
‎వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ
‎ఔదుంబరాయ దద్నాయ నీలాయ పరమేష్ఠినే
‎వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః" అనే శ్లోకం తో ప్రార్థించాలన్నాడు.
‎
‎ఇంక మూడవ రోజు దీపావళి. యమ త్రయోదశి నాటి యమదీపంతో ప్రారంభమై, నరక చతుర్దశినాడు పెరిగి దీపావళితో పరాకాష్టనందుకుని ఆనందాల శోభను కలిగిస్తుంది. ఈ అమావాస్య నాడు ప్రాతః కాలంలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులు నీటిలో వేసి ఆ నీటితో అభ్యంగన స్నానం చెయ్యటం శుభదాయకమంటారు. సంధ్యవేళలో ఇళ్ళను, వీధుల ను, నాలుగు బాటల కూడలి లోను దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ప్రీతి కలిగించాలి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో దీపాలు వెలిగించి నదులలో, చెరువులలో వదలాలి. నూతన వస్త్రాలు ధరించాలి. అడిగిన వారికి ఉన్నంతలో అన్నదానం చెయ్యాలి. పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యాలి. అర్థరాత్రివేళ స్త్రీలు చేటల మీద తప్పెటలు వాయిస్తూ ఊరంతా తిరగాలట. అలా తిరగటంవల్ల జ్యేష్టాదేవి పారిపోతుందని ఒక నమ్మకం. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం సంధ్యవేళ 'దిబ్బు దిబ్బూ దీపావళి, మళ్ళీ వచ్చె నాగులచవితి పుట్టమీద జొన్నకర్ర' అనే పాటతో దీవిటీలు కొట్టటం, కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కుని తీపి తిని ఎవరి శక్తి కొలదివారు బాణా సంచా కాలుస్తున్నారు. ఆనందం పంచుకొంటున్నారు. ఈ విధంగా బాణాసంచా
‎కాల్చటం వల్ల దాని నుంచి వచ్చే పొగ వల్ల సూక్ష్మ జీవులు నశిస్తాయి.

‎ముఖ్యంగా దీపావళినాడు 'లక్ష్మీపూ' జ' చేస్తారు. 'ధనమూలమిదం జగత్ కదా! అందుకని ఈరోజు లక్ష్మీపూజ చేస్తారు.
‎
‎'వసామి నిత్యం సుభగే ప్రగల్భే
‎దక్షేనరే కర్మణి వర్తమానే
‎అక్రోధనే దేవపరేకృతజ్ఞే
‎జితేంద్రియే నిత్య ముదీర్ణసత్వే
‎స్వధర్మ శీలేషు చ ధర్మ విత్సు
‎వృద్ధోప సేవా నిరతేచ దాంతే
‎కృతాత్మ నిక్షాంతిపరే సమర్ధే
‎క్షాంతా సుదాంతా ను తథా బలా సు
‎వసామి నారీషు పతివ్రతాను
‎కళ్యాణ శీవాసు విభూషితాను
‎సత్యాను నిత్యం ప్రియధర్మనాసు
‎సౌభాగ్య యుక్తాను గుణాన్వితాయ'
‎అంటూ లక్ష్మీదేవి తాను ఏమి ఇష్టపడుతుందో, ఎవరికి తన అనుగ్రహం కలగజేస్తుందో చక్కగా చెప్పినది. అందుకని దైవ భక్తి, ధర్మం కలిగి ఉండటం, పని
‎చెయ్యటం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలిగి ఉండటం అనేవి ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు.

‎దీపావళి ప్రాచీన కాలం నుంచి వస్తోందని, మహావీరుడు నిర్యాణం చెందిన రోజు అని,
‎ఆ రోజున దేవతలు మహా వీరుడిని పూజించి దివ్వెలు వెలిగించారని చరిత్ర చెబుతున్నది.
‎11వ శతాబ్దిలో దీపావళి జరుపుకున్నట్లు చరిత్రను
‎బట్టి తెలుస్తోంది. బుద్ధుని చుట్టూ దీపాలు పెట్టి వెలి గించి బుద్ధుని పూజించినట్లు బౌద్ధ కథలు చెబుతున్నాయి.
‎దీనిని దివ్వెల పండగగా ''సింహాసన ద్వాత్రింశతి' కావ్యంలో కొరవి గోపరాజు ప్రస్తావించాడు.
‎విక్రమ మహారాజు 'దీపావళి' పట్టాభిషిక్తుడయ్యాడని, వాటితో విక్రమ శకం ప్రారంభమైందని చరిత్రకారుల అభిప్రాయం.
‎
‎ఇలా కాలానుగుణంగా వస్తున్న దీపావళి గురించి చెబుతున్న కథలలో నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో సంహరించాడని చెబుతూ స్త్రీ శక్తికి ప్రతి రూపంగా సత్యభామా వర్ణనను పోతన ఎలా గావించాడో చూడండి..
‎
‎'రాకేందు బింబమై రవి బింబమై యొప్పు
‎నీరజాతేక్షణ నెమ్మొగంబు
‎కందర్పకేతువై ఘన ధూమకేతువై
‎యలరు బూబోడి చేలాంచలంబు
‎భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై
‎మెఱయు నాకృష్టమై మెలత చాప
‎మమృత ప్రవాహమై యనల సందోహమై
తనరారు నింతి సందర్శనంబు
‎హర్షదాయియై మహారోషదాయియై
‎పరగు ముద్దరాలి బాణవృష్టి
‎హరికి నరికిజూడ నందంద శృంగార
‎వీరరసములో విస్తరిల్ల'
‎అని సత్యభామ యందు స్త్రీ శక్తిని వీరరసా వేశంలో వర్ణించారు.
‎
‎దీపావళిని గురించి మహాకవి మధు నాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఏమ న్నారో చూడండి-
‎
‎'అమవస సంజవేళ జలజాలయ
‎సంస్తుతి పాట బట్టు వ
‎స్త్రములను దాల్చి వచ్చి ప్రమదల్
‎ప్రమిదల్ వెలిగింప సంభ్రమ
‎త్తమములు వెన్నుచూపి బలితంబులు
‎వారల క్రొమ్ముడుల్ శర
‎ణ్యములని చేరగానవి జడాశ్రయ మిచ్చె సుమాంతరంగముల్
‎కొన్ని నాగులచవితికి గొన్ని కార్తి
‎కమ్ము పున్నమకును దాచుకొమ్మటంచు
‎దల్లి చెప్పిన వినడు, మతాబులెల్ల
‎గాల్చి కుఱ్ఱడు చేతులు కాల్చుకొనియె'

‎అంటూ హృద్యంగా పద్య రూపంలో వర్ణించారు.
‎
‎మరో మహాకవి జె.బాపురెడ్డి దీపావళిని ఎలా వర్ణించారో చూడండి.
‎'నేలపై పూల దీపాలు
‎నింగిపై తారా సుమాలు
‎వెలిగించెనేమొ రాగేందిర
‎విరబూచెనేమొ త్యాగేందిర
‎సంజకాంతులే దీపపు
‎పింజల రూపమ్ము దాల్చి
‎పశ్చిమాద్రి నుండి గృహ
‎ప్రాంగణాల దిగివచ్చెనొ...?
‎చీకటి బ్రతుకులు ఆశా
‎స్మీత దోచులు వెలిగించెనో...?
‎బాలబాలికావళి దీ
‎పాల వోలె కనిపించెను
‎ప్రతి రమణీమణియు సత్య
‎భామయై విజృంభించెనటా
‎ఈ దివ్వెల తోట క్రొత్త పూలు పూయు
‎దీపావళి జనుల దీవింపగ వచ్చుగాక
‎దివ్య నవ్య దీపావళి'
‎అంటూ దీపావళిని వర్ణించారు..

‎ఇలా మన సాహిత్యంలో దీపావళి ప్రస్తావనలు, వర్ణనలు, పాటలు మనకు ఆ హ్లాదాన్ని, సందేశాన్ని అందిస్తున్నాయి.
‎
‎ఈ దీపావళికి అందరికీ శుభాలతో కూడిన జయాలు కలగాలని ఆకాంక్షిస్తూ...
‎
‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
‎సెల్ ::--8247433432
‎
‎ create title and poster