నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : :తనను నమ్ముకుని తన వెంట నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించలేకపోయానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ చిన మస్తాన్ తనపై నమ్మకంతో ముందుకు సాగారని, గెలిచినా ఓడినా కోటంరెడ్డి వెంటే ఉంటానని ఆనాడు చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తన సతీమణిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపి విజయాన్ని అందుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా చిన మస్తాన్‌ను పరిచయం చేస్తూ ఆయన రాజకీయ ప్రస్థానం, తనతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు.