BREAKING
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ క్యూట్ మూమెంట్స్: చేతిలో చేయి వేసి అదరగొట్టిన జంట! నేరేడుచర్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అరంగేట్రం: కరోల్ జి, బిజారప్ తో కలిసి ప్రదర్శన! సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన!

డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ

Select Suryaa Now
డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ


తిరుపతి :
చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ప్రవేశపెట్టిన నూతన ప్రత్యేక డిపాజిట్ పథకం ధనవృద్ధి సహకార డిపాజిట్ స్కీమ్‌ను ఖాతాదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంగళం రోడ్డు బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ కోరారు. ఈ పథకం నవంబర్ 4 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మొత్తం 345 రోజుల కాలపరిమితితో కూడిన ఈ పథకంలో పొదుపుదారులకు అత్యధికంగా 7.50 శాతం నుంచి 8.20 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు 7.50 శాతం, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 8.10 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.20 శాతం వడ్డీ లభిస్తుందని వివరించారు. ఉదాహరణకు లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే సాధారణ పౌరులకు నెలకు రూ. 621, త్రైమాసికానికి రూ. 1,875 చొప్పున మెచ్యూరిటీ సమయానికి రూ. 1,07,295 అందుతాయని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు నెలకు రూ. 670, త్రైమాసికానికి రూ. 2,025తో కలిపి మెచ్యూరిటీ నాటికి రూ. 1,07,896 లభిస్తాయని చెప్పారు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు నెలకు రూ. 679, త్రైమాసికానికి రూ. 2,050 చొప్పున మెచ్యూరిటీ సమయానికి రూ. 1,07,996 అందుతాయని ఆమె స్పష్టం చేశారు.
ఈ డిపాజిట్లపై నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా మెచ్యూరిటీ సమయంలో వడ్డీ పొందే సౌలభ్యంతో పాటు, అవసరమైతే డిపాజిట్లపై రుణం పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజల పొదుపు మొత్తాలకు పూర్తి రక్షణతో పాటు ఉత్తమ రాబడిని అందించే ఈ పథకం వివరాల కోసం తిరుపతి మంగళం రోడ్డు బ్రాంచ్‌ను నేరుగా సంప్రదించాలని లేదా 9985833486 నంబరుకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని మేనేజర్ కీర్తి సుధ సూచించారు.