ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
భూపాలపల్లి, మేజర్ న్యూస్: భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం గ్రామానికి చెందిన అజ్మీర చందు నాయక్( 39) భార్య పావని తన ప్రియుడితో కలిసి గురువారం రాత్రి 1 గంట సమయంలోఅతి దారుణంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ధరావత్ సంతోష్ పావనితో గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయంగా పావని భర్త చందు నాయక్ తరచుగా గొడవ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో చందు నాయక్ ను అడ్డు తొలగించాలని భార్య పావని తన ప్రియుడు సంతోష్ లు కలిసి ప్లాన్ వేసుకున్నట్టు తెలిసింది. అంతేకాక ఈ విషయంలో గత మూడు రోజుల క్రితం పంచాయతీ చేయాలని స్థానిక సర్పంచ్ వద్దకు వెళ్తే శుక్రవారం పంచాయతీ కి సమయం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పంచాయతీలో పూర్తి సమాచారం. బట్టబయలవుతుందని ముందస్తుగానే పావని తన ప్రియుడితో కలిసి రాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న చందు నాయక్ ను అతి దారుణంగా చంపినట్లు తెలుస్తోంది. అనంతరం శవాన్ని ఎడ్ల బండిలో చికినపల్లి శివారులో పడవేసినట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందరంతో భూపాలపల్లి డి.ఎస్.పి ఏ. సంపత్ రావు భూపాలపల్లి, గణపురం సిఐలు శ్రీనివాస్, కరుణాకర్ రావు, ఎస్సై పవన్ సంఘటన స్థలానికి చేరుకొని మర్డర్ కు సంబంధించిన వివరాలను సేకరించారు.అనంతరం భూపాలపల్లి కి పోస్టుమర్దమ్ నిమిత్తం 100 పడకల ఆసుపత్రికి తరలించారు.
రిపోర్టర్: రవీందర్, భూపాలపల్లి సూర్యప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.