వేల్పూర్ మండలం మోతే గ్రామ శివారులో పులి సంచారం?
సూర్య వేల్పూరు మండలంలోని మోతే గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామానికి చెందిన పిడుగు రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పులి సంచరిస్తున్నట్లు అక్కడ ఉన్నవారు కొన్ని ఫొటోలు తీసి ప్రచారం చేయడంతో ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ కనిపించిన అడుగుజాడలను పరిశీలించారు. అయితే అవి పులి అడుగుజాడలేనా అనే విషయంపై అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది.పులి సంచారంపై సరైన నిర్ధారణకు వచ్చిన తర్వాతే స్పష్టంగా చెప్పగలమని అటవీశాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం. అప్పటివరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలనిసూచించారు.అధికారికంగా నిర్ధారణ కాని నేపథ్యంలో గ్రామస్తులు వదంతులను నమ్మకుండా, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు.