BREAKING
బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'! డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!* కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు

విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి చెక్కు పంపిణీ -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

Select Suryaa Now
విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి చెక్కు పంపిణీ  -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

విధి నిర్వహణలో మృతిచెందిన ఆర్మ్‌డ్ రిజర్వు  కానిస్టేబుల్ రాజు కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన రూ. 1 కోటి విలువైన పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. గత ఆగస్టు నెలలో కొల్లాపూర్ సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి నాగర్ కర్నూల్ వస్తున్న క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ రాజు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఖాతా ఉన్నందున, సంబంధిత బీమా నిబంధనల ప్రకారం బ్యాంకు యాజమాన్యం రూ. 1 కోటి పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కానిస్టేబుల్ రాజు లేని లోటు తీర్చలేనిధని ఇటువంటి క్లిష్ట సమయంలో రాజు కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.   క్లిష్ట సమయంలో ఎస్‌బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజ్ ద్వారా లభించిన  పరిహారం వారి కుటుంబానికి ఆర్థికంగా కొంత ఆసరాగా నిలుస్తుందని,ప్రతి ఒక్క సిబ్బంది పోలీస్ శాలరీ ప్యాకేజ్ చేసుకోవాలని అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో కృష్ణయ్య, ఆర్ఐ రాఘవరావు, ఆర్ఎస్ఐ గౌస్ పాషా, జిల్లా పోలీస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్