కలెక్టరేట్ లో కనీస అవసరాలకు నీటి కరువు
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల కలెక్టరేట్ లో కనీస అవసరాలకు కూడా నీటి కరువు ఏర్పడింది. శుక్రవారం వివిధ పనుల నిమిత్తం ఐ డి ఓ సి కి వచ్చిన ప్రజలకు బాత్ రూమ్ లలో నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దీ రోజులుగా కలెక్టరేట్ లో పారిశుద్ధ్య నిర్వహణ అద్వానంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. మొదటి అంతస్థులో మూత్రశాలలకు తాళం వేసి ఉండటం వలన ఉద్యోగులు, ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రౌండ్ ఫ్లోర్ లోని మూత్ర శాలలకు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టరేట్ ఏ ఓ కిషన్ ను వివరణ కోరగా రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా లో అంతరాయం వలన నీటి సమస్య ఏర్పడిందన్నారు. అయితే కలెక్టరేట్ లోనే అధికారుల నిర్లక్ష్య వైఖరితో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.