ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
సూర్య, జన్నారం : జన్నారం మండలం లోని ఏఆర్ఎస్ ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం కళాశాలలో ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉదయ్ కిరణ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి, సైబర్ క్రైమ్ కి విద్యార్థులు ఏ విధంగా గురవుతున్నారో వివరించారు. సైబర్ క్రైమ్ కి గురికాకుండా ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవచ్చు అనే దానిపై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఎస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ముత్యం సతీష్, లెక్చరర్స్ మోహన్, సత్తన్న, రాజం, రవి, శ్రావ్య, ప్రవళిక, సరిత, జ్యోష్ణ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.