BREAKING
రామాయణంపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు.. నిర్మాత నమిత్ మల్హోత్రా అంకితభావం అద్భుతమన్న ప్రముఖ దర్శకుడు! ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఆయుధ డంప్ లభ్యం.. తడగొండలో ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం.. అధ్యక్షుడు గుడి మనోజ్ రెడ్డి రామాయణ కలెక్షన్ల రికార్డు బ్రేక్.. ప్రభాస్ ఆదిపురుష్‌ను దాటలేకపోయిన రణ్‌బీర్, యశ్ క్రేజ్! కొత్త హీరోలపై ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. షారుఖ్, సల్మాన్, అక్షయ్ లే చివరి సూపర్‌స్టార్లు! దివ్యేందు ధన్‌తేరస్ జ్ఞాపకాలు.. అమ్మతో కలిసి ఆ వెండి నాణేలు కొనేవాళ్లమన్న నటుడు! కూటమి పాలన మెచ్చి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు నేటి ఫలితాలు. 8న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, పుష్పయాగం గురు రంధ్వా రికార్డు.. ఈడీసీలో ప్రదర్శన ఇవ్వనున్న తొలి భారతీయ గాయడిగా చరిత్ర! వైవిధ్యమైన టైటిల్‌తో బండి సరోజ్ కుమార్ 'చాప్రి' ఫస్ట్ లుక్: టాలీవుడ్‌లో కొత్త చర్చ! అత్తను ఇంట్లోంచి గెంటేసిన కోడలు పీయూలో అంతర్ కళాశాల క్రీడా పోటీలు భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు: సెన్సెక్స్ 1718, నిఫ్టీ 493 పాయింట్ల లాభం న్యాలట గ్రామంలో జలసిరి కార్యక్రమం పరిశీలన 'కింగ్' పాట లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమైంది: కూతురు సుహానాను ప్రశంసిస్తూ షారుఖ్ ఖాన్ సంచలన కామెంట్స్!

విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి

Select Suryaa Now
విద్యార్థి సంఘం నాయకులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి

ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులకు ‘ఇండిసిప్లిన్’ పేరుతో నోటీసులు జారీ చేయడాన్ని PDSO తీవ్రంగా ఖండిస్తోంది. యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని, ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని, ప్రతి నెలా గ్రీవియెన్స్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ముందస్తుగా వినతిపత్రాలు సమర్పించకుండా ఆందోళనలు చేపడుతున్నారని నోటీసులో పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అప్రజాస్వామికం. యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉంటే వాటిని ప్రశ్నించడం, పరిష్కారం కోసం విద్యార్థులను సమీకరించడం తప్పెలా అవుతుంది? విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేయడం యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకమెలా అవుతుంది?

గత రెండు దశాబ్దాలుగా పర్మినెంట్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేపట్టకపోవడంతో 58 డిపార్ట్‌మెంట్లలో 10 విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేని పరిస్థితి నెలకొంది. డిస్పెన్సరీలో రెగ్యులర్ వైద్య సిబ్బంది లేకపోవడం, మెస్ వర్కర్లను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్ పద్ధతుల్లో నియమించడం, హాస్టళ్లకు సరిపడా మెయింటెనెన్స్ ఫండ్స్ కేటాయించకపోవడం, రూఫ్ లీకేజీల వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఉన్న మెస్‌లను అభివృద్ధి చేయకుండా, వెయ్యి మంది విద్యార్థులకు సరిపడే మెగా మెస్ నిర్మించి దాని నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రణాళికలు రూపొందించారు.

మరోవైపు, స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా, ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థుల నుంచి కోర్సు పూర్తయ్యాక ఫీజులు వసూలు చేస్తున్నా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదు. స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా సర్క్యులర్ జారీ చేయాలని మూడు నెలల క్రితం PDSO విద్యార్థులతో కలిసి వినతిపత్రం సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హాస్టల్ సమస్యలపై పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా పరిష్కారం లభించలేదు. విద్యార్థులు ఆందోళనకు దిగినప్పుడు మాత్రమే యాజమాన్యం స్పందిస్తుండగా, మిగిలిన సందర్భాల్లో సమస్యలను నిర్లక్ష్యం చేస్తోంది.

ఇన్ని సమస్యలను పరిష్కరించకుండా, వాటిపై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులకు నోటీసులు జారీ చేయడం దుర్మార్గకరం. విద్యార్థుల గొంతును అణచివేసే ప్రయత్నాలను మానుకోవాలి. విద్యార్థి సంఘ నాయకులకు జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పర్మినెంట్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేపట్టాలి. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. హాస్టళ్లు, మెస్‌లు, ఇంకా యూనివర్సిటీలో అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని PDSO డిమాండ్ చేస్తోంది.

*— Progressive Democratic Students Organisation (PDSO)*

#AndhraUniversity #StudentRights #AcademicFreedom #UniversityIssues #PDSO