BREAKING
వార్షిక లాభాల అంచనాలను పెంచిన ఆరోగ్య బీమా దిగ్గజం 'హుమానా' ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ వైష్ణవి మృతి ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి టెలిహెల్త్ దిగ్గజం 'రో' సరికొత్త పరిశోధన విభాగం అమెరికా మధ్యంతర ఎన్నికల వేడి, ఏఐ వ్యయ భారం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ త్రైమాసిక నికర లాభం స్థిరంగా నమోదు సమస్యలను గుర్తించి.. పరిష్కార మార్గాలను అన్వేషించిన విద్యార్థులు -- విజయవంతంగా జిల్లా స్థాయి బాలల సైన్స్ సదస్సు -- రాష్ట్రస్థాయి అర్హత సాధించిన మూడు ప్రాజెక్టులు క్వాల్‌కామ్‌లో 548 మిలియన్ డాలర్ల వాటాను ప్రకటించిన అల్ఫాబెట్ వైన్ ఉత్పత్తి అంచనాలను పెంచిన ఫ్రాన్స్ బోనస్‌ వచ్చింది.. పింఛన్‌ ఏది? - దీపావళి పండుగ వస్తున్నా అందని పింఛన్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి దాష్టీకం. చైనీస్ అసెంబ్లీ అసమ్మతివాదుల నిఘాపై ఇటలీ సంచలన దర్యాప్తు పేద విద్యార్థుల పై దయలేదా..? ఆర్‌.కృష్ణయ్య బడ్జెట్ చర్చలను పునరుద్ధరించనున్న బెల్జియం ప్రభుత్వం

తడగొండలో ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం.. అధ్యక్షుడు గుడి మనోజ్ రెడ్డి

Select Suryaa Now
తడగొండలో ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం.. అధ్యక్షుడు గుడి మనోజ్ రెడ్డి

సూర్య .. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామ కూడలి వరకు వీధి వీధిన ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ దినోత్సవ నినాదాలతో గ్రామం మార్మోగింది. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు గుడి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ, పొలాలు సాగు చేసేది మనమే, ప్రపంచానికి ఆహారం అందించేది మనమే అని అన్నారు. రైతులకు, ట్రాక్టర్ యజమానులకు గౌరవం దక్కాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ట్రాక్టర్ అంటే కేవలం వాహనం కాదు, రైతు జీవనాధారమని తెలిపారు.సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ చెపురి వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో అధ్యక్షుడు గుడి మనోజ్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోగురు తిరుపతిరెడ్డి, ఆమిదాల లక్ష్మారెడ్డి, చేపురి కనకయ్య, ప్రధాన కార్యదర్శి భీమ తిరుపతి, క్యాషియర్ భూమల్ల మహేష్, సంయుక్త కార్యదర్శి పిట్టల మల్లేశం, మాజీ అధ్యక్షుడు రేండ్ల గంగరాజు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.