BREAKING
బీచ్ రోడ్డులో గుడ్లు ఉచిత పంపిణీ - యన్.ఈ.సి.సి అడవి లింగాల్  కేంద్రాన్ని సీఈఓ విశ్వనాథంతో కలసి సందర్శించిన క్లస్టర్ అధికారి లక్ష్మణ్ మాణిక్ బండార్ పాఠశాలలో పొగాకు వినియోగం, మానసిక ఆరోగ్యంపై అవగాహన ఓటరు ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సు మాక్లూర్ మండల కాంగ్రెస్ కమిటీ నియామకం తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించేది లేదు! జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు 18 గ్రామాల మేట్లకు పనుల నిర్వహణ, కొలతలు, డిజిటల్ హాజరుపై అవగాహన వేల్పూర్‌లో జోనల్ స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు సర్ సివి రామన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన రావుల లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ ​కీ.శే. గుడిపాటి చిట్టిబాబు 6వ వర్ధంతి సందర్భంగా బ్లెస్స్డ్ హోమ్ విద్యార్థులకు దాతృత్వం. సముద్రాల గ్రామము మూడవ అంగన్వాడీ సెంటర్ కు ప్యాన్ అందజేసిన గుండ మధుమిత - శ్రీవాస్ ఎల్-నినో పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనం విద్యా - ప్రిన్సిపాల్

బోనస్‌ వచ్చింది.. పింఛన్‌ ఏది? - దీపావళి పండుగ వస్తున్నా అందని పింఛన్‌

Select Suryaa Now
బోనస్‌ వచ్చింది.. పింఛన్‌ ఏది? - దీపావళి పండుగ వస్తున్నా అందని పింఛన్‌
సూర్య నస్పూర్‌ : సింగరేణి కార్మికులకు బోనస్‌ అందినప్పటికీ, విశ్రాంత కార్మికులకు రావాల్సిన పింఛన్‌ మాత్రం ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్నా పింఛన్‌ అందకపోవడంతో రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్న వృద్ధ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్‌ చెల్లింపుల్లో బ్యాంకుల వారీగా వ్యత్యాసం కనిపిస్తుండటం పెన్షనర్లలో మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఎస్బీఐ ఖాతాలు కలిగిన కొంతమంది పెన్షనర్లకు పింఛన్‌ జమ కాగా, ఇతర బ్యాంకుల్లో ఖాతాలున్న వారికి మాత్రం ఇంకా అందలేదని పలువురు పేర్కొంటున్నారు. అదేవిధంగా కొన్ని రీజియన్లలో పింఛన్‌ జమ అయినప్పటికీ, మరికొన్ని రీజియన్లలో పెండింగ్‌లో ఉండటంతో ఈ వ్యత్యాసానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకేసారి పింఛన్‌ చెల్లించాల్సి ఉండగా బ్యాంకులు, రీజియన్ల వారీగా జాప్యం ఎందుకు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో పింఛన్‌ అందకపోవడంతో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎన్నో ఏళ్లపాటు సింగరేణి సంస్థలో కష్టపడి పనిచేసి పదవీ విరమణ పొందిన తమకు పండుగ వేళైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. సీఎంపీఎఫ్‌ అధికారులు తక్షణమే స్పందించి పింఛన్‌ చెల్లింపుల్లో జాప్యానికి కారణాలను వెల్లడించాలని, పెండింగ్‌లో ఉన్న మొత్తాలను వెంటనే అన్ని బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని సింగరేణి విశ్రాంత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతి నెల ఒకటో తేదీన రావాల్సిన పింఛన్‌ ఆరో తేదీ వచ్చినా ఖాతాల్లో జమ కాలేదు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పింఛన్‌ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పింఛన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. - మర్రి చంద్రయ్య సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి  విద్యానగర్,సిసిసి నస్పూర్