telangana
మాక్లూర్ మండల కాంగ్రెస్ కమిటీ నియామకం
సూర్య మాక్లూర్ : మాక్లూర్ మండల కాంగ్రెస్ కమిటీని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. నాగేష్ రెడ్డి ప్రకటించారు. మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. దయాకర్ రావుతో సంప్రదింపులు జరిపిన అనంతరం మండల కమిటీలో వివిధ పదవులకు 16 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నియామకాల్లో భాగంగా మామిడిపల్లి గ్రామానికి చెందిన శివకృష్ణ, మాక్లూర్‌కు చెందిన జాఫర్, ఒడ్యాట్‌పల్లికి చెందిన ఆర్. ప్రవీణ్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు.అదేవిధంగా అమ్రాద్‌కు చెందిన కె. జలంధర్, గుంజిలికి చెందిన సిహెచ్. శ్రీనివాస్, మాణిక్‌భండార్‌కు చెందిన గుండ్ల స్వామి, మామిడిపల్లికి చెందిన కె. సత్యనారాయణ, మెట్లపల్లికి చెందిన గంగాధర్, బొంకంపల్లికి చెందిన నజీర్, అమ్రాద్ తండాకు చెందిన గంగారాం నాయక్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.ధర్మారం గ్రామానికి చెందిన సాయమ్మ, కొత్తపల్లికి చెందిన కాసర్ల విఠల్, గోటముక్కులకు చెందిన సురేష్, మెట్టుకు చెందిన ప్రభుదాస్, ముల్లంగి (బి)కి చెందిన టి. రాజన్న, వెంకటాపూర్‌కు చెందిన రవీందర్‌రావులను కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. నాగేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ నియామకాలతో మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపొస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్,మాజీ అధ్యక్షుడు రవి ప్రకాష్,విండో ఛైర్మెన్ అశోక్,మాజీ జడ్పీటీసీ గోపాల్ నగేష్,మాజీ సర్పంచ్ రాజేందర్,పురుషోత్తం,సర్పంచి రవి,తదితరులు పాల్గొన్నారు.