ప్రమాద బాధితుడికి అండగా మంత్రి జూపల్లి
పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్: మండల పరిధిలోని కల్వకోల్ గ్రామానికి చెందిన పట్నం సత్యం ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరగడంతో నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కల్వకోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించడంతో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి సకాలంలో వైద్య సేవలు అందేలా చొరవ తీసుకున్నారు. అనంతరం వైద్యులు పట్నం సత్యంకు ఆపరేషన్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రికి వెళ్లి పట్నం సత్యంను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి గ్రామానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కష్ట సమయంలో స్పందించి వైద్య సహాయం అందేలా సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు, పరామర్శించిన కాంగ్రెస్ నాయకులకు పట్నం సత్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటమోని బిచ్చన్న గౌడ్, మదన్ గోపాల్, గువ్వలి రాముడు, వకీల్ శంకర్, ఎండీ వలి, రాంబాబు, చట్టమోని సాయిరాం తదితరులు పాల్గొన్నారు.